Monday, December 23, 2024

ఏపి సిఎం పాలనలో అన్నీ అరాచకాలే: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎపి సిఎం జగన్ పాలనలో అన్నీ అరాచకాలే అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఎపిలోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావంతులతో బుధవారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు తమ సమస్యలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురాగా.. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైకాపా పాలనలో ఎపిలో పెద్ద ఎత్తున అస్తుల దోపిడీ జరిగిందని ఆరోపించారు. “ వైకాపా విధ్వంస పాలనను ప్రజలు చూస్తూనే ఉన్నారని, జగన్ సైకో సిఎం మాత్రమే కాదు..

కరుడుగట్టిన సైకో సిఎం అని చంద్రబాబు ఆరోపించారు. రైతులకు కూడా చెప్పకుండా భూముల్లో కాల్వలు తవ్వుతున్నారని, తప్పులను ప్రశ్నిస్తే అడ్డుకునే పరిస్థితి ఉందన్నారు. ఇసుక అక్రమాలపై ఎన్‌జిటీ లో కేసులు వేసిన నాగేంద్రను మేధిస్తున్నారన్నారు. రేపో , ఎల్లుండో తనను అరెస్టు చేయచ్చు..లేకుంటే దాడి చేయవచ్చునని చంద్రబాబు తన అనుమానం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ నిప్పులా బతికానని, తాను ఏ తప్పు చేయలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News