అమరావతి: గత వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో నామినేట్ చేసిన రాష్ట్ర వక్ఫ్ బోర్డును చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. నవంబర్ 30 నాటి ఉత్తర్వులో, వైఎస్ఆర్ సి హయాంలో ఏర్పడిన ఏపి స్టేట్ వక్ఫ్ బోర్డు చాలా కాలంగా (మార్చి 2023 నుండి) పనిచేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అప్పట్లో ఏర్పడిన వక్ఫ్ బోర్డులో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు, వీరిలో ముగ్గురు ఎన్నిక కాగా, మిగిలిన ఎనిమిది మంది నామినేట్ అయ్యారు.
బోర్డు ఏర్పాటు విషయంలో అనుసరించిన విధానాన్ని సవాలు చేశాక, ఆంధ్రప్రదేశ్ హై కోర్టు 2023 నవంబర్ 1న వక్ఫ్ బోర్డు ఛైర్ పర్సన్ ఎన్నికపై స్టే విధించింది. ఆ ఉత్తర్వులో ఇలా ఉంది, “బోర్డు చాలా కాలంగా పనిచేయకపోవడం , వ్యాజ్యాలను పరిష్కరించడానికి జిఓఎంల నం. 47 యొక్క చట్టబద్ధతను సవాలుచేస్తూ రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండడాన్ని, పాలన పరమైన శూన్యాన్ని నివారించాలని కోరుతూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్( ఎ.పి స్టేట్ వక్ఫ్ బోర్డ్, విజయవాడ) ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు’’.
అన్ని అంశాలను , హైకోర్టు ఆదేశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం “తక్షణ అమలు”తో అక్టోబర్ 21, 2023 తేదీ జివోని ఉపసంహరించుకున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ తెలిపింది.
మరోవైపు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ, మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.