Wednesday, November 13, 2024

చంద్రబాబు గుండె సైజు పెరిగింది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబు గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు. చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని మెమో రూపంలో ఆయన తరపు న్యాయవాదులు ఎపి హైకోర్టుకు అందించారు. ఈ ఏడాది అక్టోబర్ 31న చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో ఎపి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించాలని కూడ ఎపి హైకోర్టు అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. దీంతో చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన వివరాలపై నివేదికను ఆయన తరపు న్యాయవాదులు అందించారు. కుడి కంటికి శస్త్ర చికిత్స నిర్వహించారు. చంద్రబాబుకు జరిగిన వైద్య పరీక్షలు, కంటికి జరిగిన కాటరాక్ట్ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను చంద్రబాబు తరపు న్యాయవాదులు ఎపి హైకోర్టుకు అందించారు. కుడి కంటికి శస్త్ర తర్వాత సంతృప్తి కారంగా కంటి పని తీరు ఉందని వెల్లడించారు. అనారోగ్య సమస్యల నుండి కోలుకునేందుకు మందులు క్రమం తప్పకుండా వాడాలని వైద్యులు సూచించారన్నారు.

అయిదు వారాల పాటు కంటి పరీక్ష కోసం డాక్టర్లు షెడ్యూల్ ఇచ్చారు. ఐదు వారాలపాటు ఆపరేషన్ చేసిన కంటికి ఇన్ ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలని వైద్యులు సూచించా రని చంద్రబాబు న్యాయవాదులు మెమోలో పేర్కొన్నారు. అంతేకాదు ఐదు వారాల పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలని సూచించా రన్నారు. ఇదిలా ఉండగా, చంద్రబాబుకు నిర్వహించిన ఇతర వైద్య పరీక్షల్లో గుండె సైజు పెరిగిన విషయం తేలిందని న్యాయవాదులు వెల్లడిం చారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాలాలలో సమస్యలు వున్నాయని తేలిందని న్యాయవాదులు ఆ మెమోలో తెలిపారు. గుండె కవాటాలకు సమస్యలు ఉన్నాయన్నారు. తగినంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని ఆ మెమోలో పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో వుండాలని వైద్యులు సూచించారని ఆ మెమోలో న్యాయవాదులు పేర్కొన్నారు. 24 గంటల పాటు వైద్య నిపుణుల అందుబాటులో ఉండాలని సూచించిన విషయాన్ని వెల్లడించారు. షుగర్ కంట్రోల్ చేసుకోవడంతో పాటు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారని ఆ మెమోలో వివరించారు.

స్కిల్ కేసు…చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టిడిపి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను ఎపి హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. బుధ వారం విచారణ సందర్భంగా సిఐడి తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో విచా రణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. మిగిలిన వాదనలు గురువారం వింటామని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News