Wednesday, January 22, 2025

చంద్రబాబు నాయుడు 9న ప్రమాణస్వీకారం చేయబోరు!

- Advertisement -
- Advertisement -

అమరావతి:  ఆంధ్ర ప్రదేశ్ లో గెలిచిన నారా చంద్ర బాబు నాయుడు జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయకపోవచ్చునని తెలిస్తోంది. బహుశా జూన్ 12 న ప్రమాణస్వీకారం చేయొచ్చు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు జూన్ 9న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు నిర్ధారణ అయింది. అయితే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నందున చంద్రబాబు నాయుడు తన ప్రమాణస్వీకారం  తేదీని మార్చుకున్నట్లు తెలిసింది. కాగా నారా చంద్రబాబు నాయుడు తన ప్రమాణస్వీకారాన్ని అమరావతిలోనే చేయనున్నట్లు భావిస్తున్నారు. ఈ వివరాలను టిడిపి జాతీయ ప్రతినిధి ప్రేమ్ కుమార్ జైన్ వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఎల్జెపి(ఆర్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్, ఎన్ సిపి నాయకుడు ప్రఫుల్ పటేల్ హాజరు కానున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News