Wednesday, January 22, 2025

బాబు లక్కీ నెంబర్ 23 ఎందుకో తెలుసా?….

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డట్లు పక్కా ఆధారాలు ఉన్నాయని వైసిపి నేత అనిల్ కుమార్ తెలిపారు. గురువారం అనిల్ మీడియాతో మాట్లాడారు. ఆధారాలతోనే బాబుకు కోర్టులు బెయిల్ ఇవ్వడంలేదని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన స్కామ్‌లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వివరించారు. బాబు 23 లక్కీ నెంబర్ అని, గతంలో వైసిపికి చెందిన 23 మందిఎంఎల్‌ఎలను లాక్కున్నాడని అనిల్ కుమార్ దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్ట్‌పై టిడిపి నేతలే సైలెంట్‌గా ఉన్నారని, వైసిపి పార్టీ నుంచి జంప్ అయిన ఎంఎల్‌ఎలు హడావుడి ఎక్కువైందని చురకలంటించారు. తప్పు చేస్తే తమ ప్రభుత్వంలో ఎంతటి వారికైనా జైలు జీవతం తప్పదని అనిల్ కుమార్ హెచ్చరించారు. ఏ వయసులో తప్పు చేసినా నేరం నేరమేనని మండిపడ్డారు.

Also Read: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్ జట్టు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News