Sunday, January 19, 2025

చంద్రబాబుకు రూ. కోటి చెక్కు అందించిన పవన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల దాటికి విజయవాడలో పలు కాలనీలు నీళ్లలో మునిగిపోయాయి. వరదల ధాటికి భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. విజయ వాడ కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ కలిసి సిఎం సహాయనిధికి కోటి రూపాయలు అందజేశారు. పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

ఇటీవల పవన్ స్వల్ప అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. వరద ప్రభావానికి గురైన 400 గ్రామాలకు లక్ష రూపాయల చొప్పున ఇస్తానని పవన్ ప్రకటించారు. నేరుగా పంచాయతీ బ్యాంకు ఖాతాలకు జమ చేస్తానని వివరణ ఇచ్చారు. తెలంగాణ సిఎం సహాయనిధి, ఎపి సహాయ నిధికి కోటి రూపాయల చొప్పున పవన్ ఇస్తున్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో టాలీవుడ్ నటులు ప్రభాస్, చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ, అల్లు అర్జున్, తదితరులు భారీ విరాళం ప్రకటించిన విషయం విధితమే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News