Friday, December 20, 2024

నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. అమిత్ షాతో భేటీ!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పొత్తులపై విపక్ష శిబిరం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. టిడిపి, జనసేన పార్టీలు ఇప్పటికే పొత్తులపై అవగాహనకు వచ్చాయి. సీట్ల సర్దుబాటుపైనా పలు దఫాలుగా చర్చలు జరిపాయి. అయితే, వీటితోపాటు బిజెపి కూడా కలుస్తుందని ఉభయ పార్టీల నేతలు భావించారు. కాగా ఇప్పటి వరకు బిజెపి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేవు. దీంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీకి వెళ్లుతున్నారు. ఎల్లుండి బిజెపి నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉన్నది. ఏపీలో పొత్తులపై ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నదని ఆ పార్టీ వర్గాలు పేర్కొటుండడం విశేషం. కాగా చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఆ తర్వాత బిజెపి నాయకులతో పవన్ కూడా భేటీ అయ్యే చాన్స్ ఉన్నది. అనంతరమే ఎపిలో పొత్తులపై స్పష్టత రానుంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లోటిడిపి , జనసేనల మధ్య అవగాహన కూడా కుదిరింది. ప్రచారంపైనా ఓ అవగాహనకు వస్తోంది కూడా. అటు ఏపీలో బిజెపి ఒంటరిగానే దూకుడు పెంచుతోంది. దీంతో ఈ రెండు పార్టీలకు బిజెపి డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తుందా? లేదా అనే అనుమానాలు వచ్చాయి. కానీ ఇటీవలేబిజెపి అధిష్టానంలో ఎపి రాజకీయాల అవగాహనలో మార్పులు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలోనే చంద్రబాబుకు బిజెపి నాయకుల అపాయింట్‌మెంట్ లభించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News