Monday, December 23, 2024

బిసిలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు లేఖ రాశారు….

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: వైఎస్‌ఆర్‌సిపి సాధికార బస్సు యాత్రకు విశేష స్పందన వస్తోందని ఎంఎల్‌సి వరుదు కల్యాణి తెలిపారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి టిడిపికి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. బిసిల తోకలు కట్ చేస్తానని చంద్రబాబు బిసిలను అవమానించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఒక్క బిసిని కూడా రాజ్యసభకు పంపలేదని, బిసిలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు లేఖ రాశారని మండిపడ్డారు. మోసపూరిత హామీలిచ్చి చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని దుయ్యబట్టారు. సిఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని వరుదు కల్యాణి ప్రశంసించారు. టిడిపి ఒంటికన్నుతో నడుస్తోందని, 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టలేని పరిస్థితి టిడిపికి వచ్చిందని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News