Sunday, January 19, 2025

జగన్ తరువాత ఇప్పుడు చంద్రబాబు, షర్మీలా కూడా అమెరికాకు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన భార్య భారతితో కలిసి లండన్ వెళ్లాక టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తన సతీమణి భువనేశ్వరితో పాటు శనివారం రాత్రి అమెరికాకు వెళ్లారు. అక్కడ ఆయన చికిత్స చేయించుకోనున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ మే 16ననే అమెరికా వెళ్లారు. కాగా చంద్రబాబు నాయుడు మే 25 లేక 26న తిరిగి రానున్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4 ఉన్నందున ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయంపై ఆయన పార్టీ నాయకులతో చర్చించనున్నారు.

ఏపిసిసి చీఫ్ వైఎస్.షర్మీలా కూడా అమెరికాలో ఉన్న తన కుమారుడు రాజా రెడ్డి వద్దకు వెళ్లారు. ఆమె తల్లి వై.ఎస్.విజయమ్మ ఇప్పటికే అమెరికాలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News