Friday, December 20, 2024

అడ్డుకోవాలని చూస్తే తొక్కుకుంటూ వెళ్తాం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని కాపాడుకోడానికి ముందుంటామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ మహానాడు లో ఆయన మాట్లాడుతూ అడ్డుకోవాలని చూస్తే తొక్కుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. ఇప్పటి వరకు మంచితనాన్నే చూశారని, రాజకీయ రౌడీలకు శిక్షవేసే బాధ్యత తనదేనన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి కష్టపడి పై కెదిగిన మహానేత ఎన్‌టిఆర్ అని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు వారి రుణం తీర్చుకోడానికే ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టారన్నారు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్‌టిఆర్‌దేనని కొనియాడారు. టిడిపిని దెబ్బతీయాలని చూసిన వారే దిబ్బతిన్నారని పేర్కొన్నారు.

క్రీస్తు శకం లాగే ఎన్‌టిఆర్ శకం అని చెప్పుకోవాలన్నారు. భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో మెనిఫెస్టో ప్రవేశ పెట్టనున్నామన్నారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం, ఇంట్లో ప్రతి మహిళకు పథకం వర్తింప చేస్తామని, తల్లికి వందనం కింది ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ. 15 వేలు, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్‌లు, జిల్లా పరిధిలో మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇంటికే పరిమితమైన ఆడబిడ్డల ఆదాయం కల్పించే బాధ్యత తమదేనని మెనిపెస్టోలో ప్రకటించబోతున్నారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు రావడం లేదని అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నది టిడిపి సిద్దాంతమని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు సబ్‌ప్లాన్ తెచ్చామన్నారు.

టిడిపిపై నమ్మకంతో రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారని చెప్పకొచ్చారు. ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చంద్రబాబు తెలిపారు. నాలుగేళ్ళలో జగన్ ఎంతమందికి ఉద్యోగాలిచ్చారని బాబు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని నాషనం చేశారని వైసిపిది అహంకార పాలన అని మండిపడ్డారు. రాజమహేంద్రవరం సమీపంలోని వేమనగిరిలో టిడిపి మహానాడు రెండవ రోజు భారీ బహిరంగ సభ జరిగింది. గాలివాన భీబత్సం సృష్టించినప్పటికీ కార్యకర్తలు, నేతలు చెదరిపోలేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రాంగణంలోనే నిలిచి ఉన్నారు. దీంతో సభ సజావుగా సాగింది.
జగన్ పనైపోయింది.
మహానాడుకు ఇబ్బందులు పెట్టే చర్యలకు పాల్పడ్డారని పోటీగా ఫ్లెక్సీలు పెట్టి వైసిపి చిల్లర రాజకీయాలకు పాల్పడిందని చంద్రబాబు విమర్శించారు. ధరల బాదుడుతో పేదలపై భారం మోపుతున్నారని, జగన్ పేదల రక్తం తాగుతున్నాడని ధ్వజమెత్తారు. నకిలీ మద్యంతో పేదల ప్రాణాలతో ఆడకుంటున్నాడని విమర్శించారు. వైసిపి నేతలు దోచుకున్న డబ్బును జప్తు చేస్తామని ఆ డబ్బును పేదలకు పంచుతామన్నారు. జగన్ అసమర్థతతో రాష్ట్రం అప్పుల పాలయ్యిందన్నారు. తను వేసిన ఫౌండేషన్ వల్లే ఇప్పుడు తెలంగాణకు భారీ ఆదాయం వస్తోందన్నారు. జగన్ చేతకాని తనం వల్ల పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారని వాపోయారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మహిళలపై అత్యాచారాలు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పనైపోయిందని ఇక మళ్ళీ రాలేదని టిడిపిఆ అవసరం వచ్చిందని చంద్రబాబు చెప్పారు.
జగన్ సైకో : లోకేష్
తెలుగువాడి దమ్మును ఢిల్లీకి చూపింది ఎన్‌టిఆర్ అయితే తెలుగవాడి సత్తా ప్రపంచానికి చాటింది. చంద్రబాబు అని నారా లోకేష్ అన్నారు. జగన్ ఒక సైకో అని విమర్శించారు. ఒక చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి సైకోలా మారాడన్నారు. లక్షల విలువైన చెప్పులు కొనేవాడు, వేల విలువగల బాటిల్ నీరు తాగేవాడు జగన్ పేదవాడా అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News