Sunday, January 19, 2025

ఏపీలో గెలుపు ఎన్డీయేదే: చంద్రబాబు నాయుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గెలుపు ఎన్డీయేదేనని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమికి మోడీ అండ ఉంది.. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటే అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ అన్న చంద్రబాబు మోడీ అంటే భవిష్యత్, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం అన్నారు. ఎన్నో పథకాలతో ప్రధాని మోడీ సంక్షేమం అందించారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటివి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే లక్ష్యంతో మోడీ పని చేస్తున్నారని తెలిపారు. ప్రధాని ప్రపంచంలో భారత్‌ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చారని చంద్రబాబు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News