Friday, December 20, 2024

12న బాబు ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 9న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. తొలుత ఈ నెల 9నే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే 9న ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నందున ఒకే రోజు రెండు కార్యక్రమాలకు వీలుపడదని భావించి చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల 12కి మార్చినట్లు సమాచారం. ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఎన్‌డిఏలోని భాగస్వామ్య పక్షాల నేతలంతా హాజరు అవుతున్నందున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News