Sunday, December 22, 2024

ఆంధ్రలో చంద్రోదయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ నూ తన ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకా రం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చే సిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చే యడం ఇది నాలుగోసారి. అనంతరం 24మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత సిజెఐ జస్టిస్‌ఎన్‌వి రమణ, కేంద్ర మంత్రులు అమిత్ షా,జేపీనడ్డా,గడ్కరీ, రామ్మోహన్‌నాయుడు, చిరాగ్ పాశ్వాన్‌తో పా టు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు. సినీప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్ దంపతులు, రామ్చరణ్ తదితరులు వచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబా బు ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకా రం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు తో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే… అంటూ బాబు ప్ర మాణం కొనసాగింది. అనంతరం చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి గా జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ ప్ర మాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న తరువాయి 6లో
శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రమాణం ఆచరించారు. అనంతరం చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం
ఏపీ మంత్రిగా జనసేన అధినేత కొణిదెల పవన్కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి చప్పట్లతో అభినందించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ గవర్నర్తో పాటు సీఎం చంద్రబాబుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు.

పవన్ కల్యాణ్ అనే నేను..
“కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను” అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను..అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఆయన సతీమణి అన్నా లెజనోవా, సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆయనతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించారు. ఆపై వేదికపై ఉన్న గవర్నర్, ఇతర ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కల్యాణ్ నమస్కరించారు. సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

కన్నుల పండువగా మంత్రుల ప్రమాణ స్వీకారం
నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం కన్నుల పండువగా జరిగింది. జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్, చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్(జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్(బీజేపీ), నిమ్మల రామానాయుడు, మహ్మద్ ఫరూఖ్, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డి బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్(జనసేన), గుమ్మడి సంధ్యారాణి,

బీసీ జనార్ధన్రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, మూడు పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. సినీ రంగం నుంచి చిరంజీవి, రజినీకాంత్, నారా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మెగా బ్రదర్స్‌తో మోడీ సందడి :
ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక మంత్రులతో చంద్రబాబు నాయుడు గ్రూప్ ఫొటో దిగారు. ఆ తర్వాత తన దగ్గరకు వచ్చిన పవన్ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. కాస్త దూరంలో ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చి.. ఇద్దరి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు. ఆ తర్వాత ఇద్దరికి దగ్గరకు తీసుకుని కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News