Wednesday, January 22, 2025

పెగాసస్… మా ఫోన్లను బాబే ట్యాప్ చేశారు: అంబటి

- Advertisement -
- Advertisement -

Chandrababu naidu tapping YCP Leaders Phones

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పైవేర్‌ను కొని ఉపయోగించారని వైసిపి ఎంఎల్‌ఎ అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెగాసస్ స్పైవేర్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసిపి నేతలందరి ఫోన్లను ట్యాప్ చేశారని, ప్రత్యర్థి పార్టీని భూస్థాపితం చేయాలన్నదే చంద్రబాబు ప్లాన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసస్ వ్యవహారంపై ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని, చంద్రబాబు హయాంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించారన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా తెలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు లేకుండా సిఎం మమతా మాట్లాడరు కదా అని, ఒకరి కోసం అబద్ధాలు ఆడాల్సిన అవసరం మమతకు లేదన్నారు. పెగాసస్ వ్యవహారంలో తమకు సంబంధంలేదని టిడిపి నేతలు బుకాయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఓ పోలీస్ అధికారి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కాకుండా టిడిపి నేతలా వ్యవహరించారని అంబటి ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News