Friday, January 10, 2025

డిసెంబర్ 10 నుంచి చంద్రబాబు పర్యటన

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనంలోకి వెళ్లడానికి పర్యటనలు చేయబోతున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు తరువాత మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తరువాత ఇంటికే పరిమితమయ్యారు. శస్త్ర చికిత్స చేయించుకున్న తరువాత ఆయన ఉ రెగ్యులర్ బెయిల్ కూడా పొందారు. గురువారం తిరుమలలో శ్రీవారిని చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్న విషయం తెలిసిందే. తన శేష జీవితం ప్రజలకే అంకితం చేస్తానని, నాలుగు రోజులు రాజకీయాల గురించి మాట్లాడబోనని చెప్పారు. మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సుల కోసం యాత్ర శ్రీకారం చుట్టానని వివరించారు. ఆదివారం సింహాచలం, మంగళవారం శ్రీశైలం దేవుళ్లను దర్శించుకుంటానని చెప్పారు.

డిసెంబర్ 10 నుంచి జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఎపిలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఢిల్లీ వెళ్లి సిఇసికి బాబు పిర్యాదు చేయనున్నారు. డిసెంబర్ 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావు పేట, 15న కడపలో చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్‌పిటిసిలు, ఎంపిపిలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. ఒక్కో సమావేశానికి సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు-పవన్ కలిసి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News