Sunday, January 19, 2025

అయితే వారిని జీవితాంతం జైల్లో పెట్టాలి: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై కక్ష సాధింపులకు పాల్పడ్డారని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. శుక్రవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అయ్యన్నపై అక్రమ కేసులు వేధింపులను ఖండిస్తున్నామని, ప్రభుత్వంపై అయ్యన్నపాత్రుడి విమర్శలే నేరమైతే, మంత్రులు, వైసిపి నేతలు రోజూ చేసే బూతు వ్యాఖ్యలకు వారిని జీవితాంతం జైల్లోనే పెట్టాలన్నారు. అసమర్థ, మాఫియా పాలకులను విమర్శించక ఏం చేస్తారని అడిగారు. దైర్యం ఉంటే విమర్శలకు జవాబు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ తప్పులు, నేరాల్లో పోలీసులు భాగస్వాములైతే ఆ అధికారులు తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Also Read: రాజారెడ్డి రాజ్యాంగంలో వీరికి ప్రత్యేక హక్కులు ఇచ్చారా?: లోకేశ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News