Friday, December 20, 2024

విశాఖలో జగన్ రూ.40 వేల కోట్లు దోచుకున్నారు: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తాను విశాఖపట్నానికి తెచ్చిన కంపెనీలను సిఎం జగన్ తరిమేశారని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. లూలూ కంపెనీని తరిమికొట్టి ఆ భూమిని మింగేశారని, విశాఖ ఉక్కుపై జగన్ ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మాడుగులలో ‘రా కదిలారా’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. విశాఖపట్నం పెట్టుబడులకు స్వర్గధామం అని ప్రశంసించారు. విశాఖలో జగన్ రూ.40 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. దోచుకోవడమే తప్ప జగన్‌కు ఉత్తరాంధ్రపై ప్రేమ లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. విశాఖను జగన్ గంజాయి కేంద్రంగా, నేర రాజధానిగా మార్చాడని మండిపడ్డారు. గంజాయి అమ్ముతూ ఎపి పోలీసులు హైదరాబాద్‌లో దొరికిపోయారని ఎద్దేవా చేశారు. జగన్‌లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని బాబు అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News