Monday, December 23, 2024

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం !

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి తృటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా టిడిపి నేతలు స్టేజీ మీదకు వచ్చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని టిడిపి నేతలు తోసేశారు. దీంతో చంద్రబాబు నాయుడు తుళ్లి పడబోయారు. వెంటనే అలర్ట్ అయిన ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆయనను పట్టుకుని నిల్చోబెట్టారు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది టిడిపి నేతలందరినీ కిందకి దించేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టిడిపి ఏర్పాటు చేసిన ‘రా.. కదలిరా..’ సభలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News