Sunday, December 22, 2024

ఎపిలో తెలంగాణ బిజెపి నేతకు చంద్రబాబు టిక్కెట్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎన్నికల తరుణం సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శుక్రవారం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేశారు. 13 మంది పార్లమెంట్ (ఎంపీ) అభ్యర్థులను, 11 మంది శాసనసభ సభ్య (ఎమ్మెల్యే) అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధికి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ టిక్కెట్టు ఆఫర్ చేయడం గమనార్హం. బాపట్ల ఎంపి అభ్యర్థిగా మాజీ డిజిపి కృష్ణప్రసాద్‌ను ప్రకటించారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బిజెపి టికెట్ ఆశించిన కృష్ణప్రసాద్ కు దక్కలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు వరంగల్‌ నుంచి బిజెపి ఎంపి టికెట్‌ను ఆశించిన ఆయన చివరకు ఎపిలోని బాపట్ల లోక్‌సభ స్థానానికి టిడిపి అభ్యర్థిగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News