- Advertisement -
తాము అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ప్రజాగళం యాత్రలో భాగంగా ఆయన పలమనేరులో మాట్లాడుతూ యువతరం ఆశలను జగన్ వమ్ము చేశారని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి కోసం జగన్ చేసింది శూన్యమన్నారు. అనంతపురంలో కియా పరిశ్రమ ఏర్పాటుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ప్రాజెక్టులను తాము అభివృద్ధి చేశామని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు అభివర్ణించారు. మే 13తో రాష్ట్రానికి పట్టిన జగన్ శని వదిలిపోతుందన్నారు.
- Advertisement -