నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన టిడిపి అ ధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో తీవ్ర విషాదం నెలకొంది. సభకు భారీగా కార్యకర్తలు తరలిరావడంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగి అదుపుతప్పి మురుగు కాలువ లో పడి 8మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి త రలించి చికిత్స అందజేస్తున్నారు. దేనినేని రవీంద్రబాబు (ఆత్మకూరు), కలవకూరి యానాది (కొండమూడుసుపాలం), యాటగిరి విజయ (ఉలవపాడు), కాకుమాని రాజా (కందుకూరు), మరలపాటి చినకొండయ్య (గుళ్లపాలెం), పురుషోత్తం (కందుకూరు), ఈడిమురి రాజేశ్వరి (కందుకూరు) మృతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చంద్రబాబు ప్రకటించారు. గాయపడిన వారికి పార్టీ అండగా ఉం టుందని, బాధితుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు వి ద్యాసంస్థల్లోచదివిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదని చంద్రబాబు అన్నారు. ఎప్పుడు కందుకూరు వచ్చినా ఆసుపత్రి సెంటర్ లోనే పార్టీ సభ పెడుతుంటామని, కానీ ఈసారి దురదృష్టకర ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభను కొనసాగించడం భావ్యం కాదని, దీన్ని సంతాప సభగా భావించి మృతుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని తెలిపారు, అనంతరం సభను అర్ధాంతరంగా ముగించారు.
బాబు సభలో తొక్కిసలాట… 8 మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -