Sunday, December 22, 2024

చంద్రబాబు క్వాష్ పిటిషన్ సిజెఐకి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిం ది. ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు చెప్పారు. దీంతో తదుపరి చర్యల కోసం సిజెఐకు నివేదిస్తున్నా మని తెలిపారు. చంద్రబాబుపై నమోదు చేసిన కేసులు చట్టవిరుద్దమని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ప్రకటించారు. చంద్ర బాబుపై కేసుల్లో తగిన అనుమతులు లేకుండా ముందుకెళ్లారు. కేసుల నమోదుకు ముందు సిఐడి తగిన అనుమతి తీసుకొని ఉండాల్సిందని జస్టిస్ బోస్ స్పష్టం చేశారు. సెక్షన్ 17-ఎ కింద ముందస్తు అనుమతులు తప్పనిసరని, లేకపోతే అది చట్ట విరుద్ధమని తన తీర్పులో వెల్లడించారు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సెక్షన్ 17(ఎ) వర్తిస్తుంది.

ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. అయితే రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయడం కుదరదని, ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లు బాటు కాదనలేమన్నారు. చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి 17ఎ వర్తింపజేయలేమని జస్టిస్ బేలా త్రివేది తెలిపారు. 2018లో వచ్చిన చట్ట సవరణలో సెక్షన్ 17ఎ ఏనాటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో చట్టం రాక ముందు కాలానికి దాన్ని వర్తింపజేయలేమన్నారు. అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం సెక్షన్ 17ఎ మూల ఉద్దేశం కాదని, ఈ సెక్షన్ అమల్లోకి రాకముందు కాలానికి వర్తింపజేస్తే అనేక పెండింగ్ కేసులు, విచారణలు ప్రభావితమవుతాయన్నారు. ఐపిసి సెక్షన్లు కూడా నమోదై ఉన్నప్పుడు కేవలం సెక్షన్ 17ఎ ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం ఎఫ్‌ఐఆర్ కొట్టేయడానికి కారణం కారాదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News