Sunday, December 22, 2024

వైసిపికి కౌంట్ డౌన్.. మన రాజధాని అమరావతే: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబులు ఇరు పార్టీల కార్యకర్తలతో కలిసి భోగి సంబరాలు జరుపుకున్నారు. ఆదివారం గుంటూరు జిల్లాలోని మందడం గ్రామంలో నిర్వహించిన భోగి సంబరాల్లో వీరిద్దరూ పాల్గొని సందడి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఇవాళ్టి నుంచి 87 రోజులే సమయం ఉందని.. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న వైసిపికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. జనసేన-టిడిపి కలిసి హామీ ఇస్తున్నా.. మన రాజధాని అమరావతే అన్నారు.

త్వరలో అమరావతి నుంచి పేదల పాలన ప్రారంభం అవుతుందని చెప్పారు. వైసిపి విముక్త రాష్ట్రం కోసం అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని చెప్పి మోసం మండిపడ్డారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. కర్నూల్‎లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించాలన్నారు. వచ్చే ఏడాది ఇదే ప్రాంతంలో సంక్రాంతి వైభవంగా జరుపుకునే రోజు వస్తుందని చంద్రబాబు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News