Sunday, December 22, 2024

కుప్పంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబునాయుడు అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఆయన స్వయంగా పేదలకు వడ్డించారు. ఆ తర్వాత తనను చూసేందుకు వచ్చిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జనంలో గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహాన్ని చూస్తున్నానని, వైఎస్సార్ సీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోందని అన్నారు. కుప్పంలో గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

వచ్చే ఎన్నికలలో తనకు లక్ష మెజారిటీ ఇవ్వాలని కోరారు. వైఎస్సార్ సీపీ నాయకులు మితిమీరి ప్రవర్తిస్తున్నారని, అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మూడు రోజులుగా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News