Monday, December 23, 2024

రాజమండ్రి జైలులో డీహైడ్రేషన్ తో బాధపడుతున్న చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు అస్వస్థతకు లోనయ్యారు. జైలులో తీవ్ర ఉక్కపోత కారణంగా ఆయన డీహైడ్రేషన్ కు గురయ్యారు. దీనిపై చంద్రబాబు జైలు మెడికల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ములాఖత్ సమయంలో కుటుంబ సభ్యులకు కూడా తెలిపారు. ఎపిలో గత కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజమండ్రి పరిసరాల్లోనూ గత నాలుగు రోజులుగా 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విపరీతమైన ఉక్కపోత నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News