Thursday, January 23, 2025

రేపు ఏపి అసెంబ్లీలో చంద్రబాబు ప్రమాణం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజులు జరుగనున్నాయి. ఈ రెండ్రోజుల్లో ఎంఎల్ఏల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. జూన్ 21, 22 తేదీల్లో సభ సమావేశాలు. ఈ విషయాలను ఆంద్రప్రదేశ్ శాసససభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

మొదట ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ఆ తర్వాత మహిళా ఎంఎల్ఏలు, ఇతర ఎంఎల్ఏలు ప్రమాణస్వీకారం చేస్తారన్నారు.

సీటింగ్ ఏర్పాటు అక్షర క్రమం ప్రకారం ఉంటుందని, వైసిపి సభ్యులంత ఒకే చోట కూర్చుంటారని కూడా పయ్యావుల కేశవ్ వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News