Monday, December 23, 2024

అప్పుడు.. శ్రీవారే నన్ను కాపాడారు: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

ప్రజలకు సేవ చేసేందుకు తనకు శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని వేడుకున్నానని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం తన తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి చంద్రబాబు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమలకు చేరుకున్న చంద్రబాబు దంపతులకు వైకుంట కాంప్టెక్స్ వద్ద ఆలయ అధికారులు సాదరస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అంతరం రంనాయకుల మండపంలో ఆలయ అర్చకులు చంద్రబాబుకు వేదాశీర్వచనం చేసి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. కష్టం వచ్చినప్పుడు స్వామివారిని మొక్కుకున్నానని.. ధర్మాన్ని కాపాడాలని శ్రీవారిని ప్రార్థించానని చెప్పారు. గతంలో అలిపిరి వద్ద ప్రమాదం జరిగినప్పుడు తిరుమల శ్రీవారే తనను కాపాడారు అని అన్నారు. ప్రపంచంలో భారతదేశంలో అగ్రస్థానంలో ఉండాలని.. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News