Sunday, December 22, 2024

నన్ను అకారణంగా జైల్లో పెట్టారు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: తనను అకారణంగా జైలులో పెట్టారంటూ ఆవేదనతో జడ్జి ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యంతమయ్యారు. నన్ను అకారణంగా జైల్లో పెట్టారు, నా బాధ, ఆవేదనంతా అదే. నా గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసునని జడ్జికి చంద్రబాబు మొరపెట్టుకున్నారు. శుక్రవారం సిఐడి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబును జడ్జి ముందు ప్రవేశపెట్టింది.

ఆ సమయంలో చంద్రబాబు తన బాధను బయటపెట్టారు. దాదాపూ కన్నీటి పర్యంతమైన బాబు ఆవేదనతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాబు తెలిపిన విషయాలు నోట్ చేసుకున్నానన్న జడ్జి, చట్టం అందరికీ సమానమన్నారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడుతాయి. అంతేకానీ రిమాండ్ ను శిక్షగా భావించొద్దని సూచించారు. ఇది చట్ట ప్రకారం జరుగుతున్న విచారణ అని జడ్జి, చంద్రబాబుకి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News