Sunday, December 22, 2024

9న చంద్రబాబు ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డిఏ కూటమి విజయ ఢంకా మోగిస్తోంది. స్పష్టమైన మెజారిటీ సాధించే దిశలో కదులుతోంది. ప్రస్తుతానికైతే టిడిపి 136, జనసేన 20, బిజెపి 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాగా వైసిపి 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కొనసాగిస్తోంది. ఫలితాలపై స్పష్టత ఏర్పడుతోంది.

ఈ నేపథ్యంలో ఈ నెల 9న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారని వార్త. అమరావతిలో ప్రమాణస్వీకారోత్సవం ఉండనున్నదని తెలిసింది. చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News