- Advertisement -
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి రోజు సిఐడి విచారణ ముగిసింది. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును సిఐడి అధికారులు విచారించారు. సుమారు ఆరు గంటలపాటు చంద్రబాబును సిఐడి అధికారులు ప్రశ్నించారు. సిఐడి డిఎస్‌పి ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది బృందం విచారించింది. బాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ జరిగింది. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో సిఐడి అధికారులు ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడిని సిఐడి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.
Also Read: మద్యం నోటిఫికేషన్‌పై ఉన్న శ్రద్ధ…. ఉద్యోగ నోటిఫికేషన్లపై లేదు…
- Advertisement -