అమరావతి: జనసేన నాయకులు, కార్యకర్తలను అరెస్టును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఖండించారు. విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన పేరుతో పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసిపి చేస్తున్న కుట్రలు దుర్మార్గమన్నారు. పవన్ బస చేస్తున్న హోటల్ లో సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను కల్పిత కేసులతో టార్గెట్ చేస్తుందని విమర్శించారు. ఒక పార్టీ అధినేత కారులో కూర్చోవాలో.. బయటకు వచ్చి అభివాదం చెయ్యాలో కూడా పోలీసులే నిర్ణయిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
విశాఖలో వైసిపి ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. జనసేన అధినేత @PawanKalyan గారి జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసిపి చేస్తున్న కుట్రలు దుర్మార్గం. ఆయన బస చేస్తున్న హోటల్ లో సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనం.(1/3) pic.twitter.com/5mApPkNOac
— N Chandrababu Naidu (@ncbn) October 16, 2022