తెలుగు రాష్ట్రాలు నాకు ఇల్లు లాంటివి : సోనుసూద్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నాకు రెండో ఇల్లు లాంటివని నటుడు, రియల్ హీరో సోనుసూద్ పేర్కొన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఆయన తనకు ఆంధ్రా, తెలంగాణ అంటే రెండో ఇల్లు లాంటివి అంటూ తెలుగు రాష్ట్రాలపై ఆయనకున్న ప్రేమను చాటాడు. చంద్రబాబు వర్చువల్ సమావేశంలో నటుడు సోనూసూద్‌తో పాటు వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఆంధ్రా అల్లుడినే నా భార్య గోదావరి ప్రాంతానికి చెందిన అమ్మాయి కావటంతో.. ఈ ప్రాంతాలతో నాకు ఏదో తెలియని బంధం ఏర్పడిందన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 18 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సోనుసూద్ వెల్లడించారు. తొలిదశలో కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్‌తో పాటు 4 చోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆక్సిజన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాయని ప్రజాసేవకు స్పందించే ప్రతి ఒక్కరూ నిజమైన హీరోలేనని భావిస్తున్నట్లు తెలిపారు. ఇతరులకు సాయం చేసే శక్తి లేదని, ఎలా చేయాలో, ఏం చేయాలో అని అనుకోవద్దని సోనూసూద్ అన్నారు. ఎప్పుడూ ప్రతి ఒక్కరూ వారివారి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దని సోనూసూద్ కోరారు. దేశవ్యాప్తంగా డౌన్ వేళ సొంత ప్రాంతాలకు వెళ్లలేక అవస్థలకు గురైన అభాగ్యులను వారి ఇళ్లకు చేర్చి నటుడు సోనుసూద్ ఆపద్భాంధవుడైయ్యాడు. కరోనా సెకండ్ వేవ్ లోనూ తన వంతు కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నాడు.
Chandrababu Video Conference With Sonu Sood