Thursday, January 23, 2025

కాసాని కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ హైదరాబాద్: తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కుటుంబాన్ని మాజీ సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాసాని జ్ఞానేశ్వర్ తల్లి కాసాని కౌసల్య ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా ఆదివారం బాచుపల్లిలోని కాసాని జ్ఞానేశ్వర్ నివాసానికి చంద్రబాబు వెళ్ళి కౌసల్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. కాసాని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రబాబుతో పాటు మాజీమంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి, టిటిడిపి మాజీ అధ్యక్షుడు బక్కిని నర్సింహులు తదితర టిడిపి నేతలు కాసానిని పరామర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News