Sunday, December 22, 2024

జగన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తుగ్లక్ సిఎం జగన్ మోహన్ రెడ్డి వెయ్యి తప్పులు చేశారని, ఇంకా భర్తిస్తారా? అని ఆంధ్రా ప్రజలను టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగారు. ఓటు అనే వజ్రాయుధంతో జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎపిలో ఏ వర్గం అయినా సంతోషంగా ఉందా? అని ప్రశ్నించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి సభలో ఆయన ప్రసంగించారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, 82 రోజుల్లో ఈ వైసిపి ప్రభుత్వం దిగిపోనుందని చురకలంటించారు. జీతం కోసం అడిగితే ఉద్యోగులు జైలు వెళ్లే దుస్థితి ఏర్పడిందని, జగన్ పోవాలి… రాష్ట్రాన్ని కాపాడుకోవాలని బాబు పిలుపునిచ్చారు.

25 ఏళ్ల క్రితం తాను యువతకు ఐటి అనే ఆయుధం ఇచ్చానని, ఇప్పుడు అది వజ్రాయుధమైందని ప్రశంసించారు. టిడిపి హయాంలో తిరుపతిని మొబైల్ హబ్‌గా తయారు చేశామని, రా కదిలిరా అని పిలుపు ఇస్తే వెంకటగిరి గర్జించిందని, వైసిపి వచ్చాక వెంకటగిరి తలరాత మారిందా? అని బాబు ప్రశ్నించారు. ఎపిలో రాజకీయ దృశ్యం మారిపోతుందన్నారు. వైసిపిలో ఉండే ఆనం జగన్ పాలన బాగోలేదని చెప్పారని, ఆనం ప్రజాహితం కోసం మాట్లాడితే దూరం పెట్టేశారని దుయ్యబట్టారు. సీనియర్లను కూడా లెక్కపెట్టని అహంకారం జగన్‌ది అని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News