Wednesday, January 22, 2025

చంద్రబాబు అరెస్టు దుర్మార్గం

- Advertisement -
- Advertisement -

ఏపిలో ఓటమి భయంతోనే జగన్ కుట్రలు
ప్రజా ఆగ్రహంతో వైసిపి ప్రభుత్వానికి పుట్టగతులుండవు
‘సత్యమేవజయతే’ నిరాహారదీక్షలో కాసాని జ్ఞానేశ్వర్ మండిపాటు
ఢిల్లీలో లోకేశ్..రాజమండ్రిలో చంద్రబాబు, భువనేశ్వరీల దీక్ష

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రం కోసం..దేశం కోసం..నిరంతర ప్రజా శ్రేయస్సు కోసం..24 గంటలు అహర్నిశలు పాటు పడుతున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం దుర్మార్గం అని టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. విజన్ 2047తో దేశ అభివృద్ధి కోసం కష్టపడే నాయకుడని పేర్కొన్నారు. టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి జైలులో చంద్రబాబు, రాజమండ్రిలో నారా భువనేశ్వరి, ఢిల్లీలో నారా లోకేష్ ‘సత్యమేవ జయతే పేరుతో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారని ఈ దీక్షలకు సంఘీభావంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్ ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ మేరకు..చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ.. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ దీక్షను ప్రారంభించామని, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఈ దీక్షలో పాల్గొన్నారన్నారు. ఈ సందర్భగా కాసాని మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్ ప్రజలలోకి వెళ్లి పాదయాత్ర, సభలు నిర్వహిస్తుంటే లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రావడాన్ని తట్టుకోలేని సైకో జగన్ ఈ అక్రమ అరెస్టు చేయించారన్నారు.

మహాత్మా గాంధీ జయంతి రోజున ఈ అక్రమ అరెస్టును తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తు ఈ నిరసన దీక్ష చేపట్టిందన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక ప్రపంచంలోని తెలుగు ప్రజలు ఖండిస్తూ..నిరసనలు తెలుపుతున్నారన్నారు. కులాలకు అతీతంగా కుటుంబాలకు కుటుంబాలు రోడ్లపైకి వస్తున్నాయని, ఈ కష్టాలు తాత్కాలికమేనని, రాబోయే రోజులలో వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు అని కాసాని ఘాటు విమర్శలు చేశారు. నారా లోకేష్ పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తే అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని, మీ కేసులకు భయపడే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదన్నారు. అక్రమ కేసులను, అరెస్టులను ఎదుర్కొని పోరాటం చేస్తామని కాసాని పేర్కొన్నారు.

అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు , నారా, నందమూరి కుటుంబ సభ్యులకు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మురళీమోహన్, అలాగే నందమూరి సుహాసిని, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు,అరవింద్ కుమార్ గౌడ్‌లు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, పార్టీ ఉపాధ్యక్షులు సామ భూపాలరెడ్డి , రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు ,నాయకులు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు, వివిధ జిల్లాల పార్లమెంట్ అధ్యక్షులు, అసెంబ్లీ ఇంచార్జీలు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

దొంగకేసుల నుంచి న్యాయమే మమ్మల్ని కాపాడుతుంది: ఢిల్లీలో నిరసన దీక్షలో నారా లోకేష్
దొంగ కేసులనుంచి న్యాయం, చట్టాలే తమను కాపాడతాయని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా డిల్లీలో లోకేష్ చేపట్టిన నిరాహారదీక్షను ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్ కుటుంబ సభ్యులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు తెచ్చినందుకే దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. జవాబుదారి తనంతో పనిచేయాలని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చంద్రబాబు యత్నిస్తారన్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబును తప్పుడు కేసుపెట్టి 24 రోజులుగా జైలులో పెట్టడం అన్యాయం అన్నారు.

చంద్రబాబు, భువనేశ్వరి సత్యమేవ జయతే దీక్ష :
రాజమహేంద్రవరం స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా సోమవారం సత్యాగ్రహ దీక్షకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెట్రల్ జైలులోనే సత్యమేవ జయతే దీక్షను చేపట్టగా … చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజమహేంద్రవరంలో దీక్షను నిర్వహించారు. మొదలుపెట్టారు. అంతకుముందే ఢిల్లీలో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు సత్యగ్రహ దీక్షలో కూర్చుకున్నారు. రాజమహేంద్రవరంలో భువనేశ్వరి నిరశన దీక్ష చేపట్టగా ఈ నిరసన దీక్ష లో నారా భువనేశ్వరి కి వివిధ వర్గాల ప్రజలు, నేతలు మద్దతు పలకడం గమనార్హం.

Kasani 1

Kasani 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News