Friday, November 22, 2024

రైతు వ్యతిరేకి చంద్రబాబు శిష్యుడు రేవంత్

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్

సదాశివపేట: రైతులు ఆనందంగా ఉండడం కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదని, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని రేవంత్ రెడ్డి మాట్లాడటం హేయమైన చర్య అని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం సదాశివపేట బస్టాండ్ ముందు వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్‌పై రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో రోడ్డుపై భైఠాయించి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి తక్షణమే రైతులకు తక్షణమే క్షమాపణ చేయాలని డిమాండ్ చేశారు. తన గురువు చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో రేవంత్‌రెడ్డి వారసుడిగా కరెంట్ సమస్యపై బషీర్‌బాగ్ కాల్పుల ఘటనను పునారావృతం చేసేందుకు రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారన్నారు.

డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాట్లాడుతూ రైతుల సంక్షేమం పట్టని కాంగ్రెస్ నాయకులు ఉచిత విద్యుత్ వద్దంటున్నారన్నారు. కాంగ్రెస్‌కు ఓటువేస్తే రాష్ట్రంలో చీకటి రావడం ఖాయమన్నారు. రేవంత్‌కు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, ఎంపిపిలు యాదమ్మ, మనోజ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, రైతు బంధు కొండాపూర్ మండల అధ్యక్షుడు మల్లేశం,కౌన్సిలర్‌లు పులిమామిడి రాజు, పిల్లోడి విశ్వనాథం, సాతానీ శ్రీశైలం, మోబీన్, వీరేశం, రాచిరెడ్డి, పాండురంగం, విఠల్, గోవర్దన్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News