Monday, December 23, 2024

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఎసిబి కోర్టును ఆశ్రయించిన కుటుంబ సభ్యులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : చంద్రబాబు ఆరోగ్యం పరిస్థితిపై ఎలాంటి నివేదిక అందించలేదంటూ ఆయన కుటుంబ సభ్యులు ఎసిబి కోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టిడిపి అధినేతను సిఐడి గత నెలలో అరెస్ట్ చేసి, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, టిడిపి కేడర్ ఆందోళన చెందుతోంది.

ఈ క్రమంలో తాజాగా కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నివేదిక ఇవ్వలేదని చెబుతున్నారు. ఆరోగ్య నివేదిక కోసం ఎసిబి కోర్టును ఆశ్రయించారు. తమకు ఫిజికల్ డాక్యుమెంట్ అందలేదని న్యాయస్థానం తెలిపిందని పేర్కొన్నారు. 12వ తేదీ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల నివేదిక ఇవ్వలేదని తెలిపారు. అధికారులు చెప్పిన అంశాలతోనే హెల్త్ బులెటిన్ ఇస్తున్నారని వారు కోర్టుకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News