Wednesday, January 22, 2025

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది : జైలు అధికారులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసినట్లు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు వెల్లడించారు. చంద్రబాబుకు డాక్టర్ల బృందం 8 రకాల వైద్య పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. వైద్య అధికారుల బృందం ఇచ్చిన వైద్య నివేదిక ప్రకారం ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జైలు అధికారులు పేర్కొన్నారు. కానీ చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతూ ఆయన బరువును మాత్రం జైలు అధికారులు వెల్లడించలేదని టిడిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Chandrababu Naidu Health Bulletin

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News