Monday, December 23, 2024

బాబుకు నిరాశే

- Advertisement -
- Advertisement -
అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగింపు

మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్‌ను అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదివారం ఎసిబి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ ఆదివారంతో ముగిసింది. దీంతో చంద్రబాబు రిమాండ్‌ను ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ఎసిబి కోర్టు న్యాయమూర్తి ఆదివారం వెల్లడించారు. ఆదివారం సాయంత్రం సిఐడి కస్టడీ పూర్తి కాగానే ఎసిబి కోర్టు జడ్జి ముందు చంద్రబాబును వర్చువల్‌గా జైలు అధికారులు హాజరుపర్చారు. చంద్రబాబు కస్టడీకి ఇవ్వాలని సిఐడి తరపు న్యాయవాదులు కోరారు. సిఐడి న్యాయవాదులు కస్టడీ కోరుతూ మెమో దాఖలు చేయడంపై చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారంతో రిమాండ్ ముగియడంతో చంద్రబాబు రిమాండ్‌ను మరో 11 రోజుల పాటు పొడిగిస్తున్నట్టుగా ఎసిబి కోర్టు వెల్లడించింది.

ముగిసిన చంద్రబాబు రెండ్రోజుల సీఐడీ కస్టడీ..
ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు రెండ్రోజుల సిఐడి కస్టడీ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. దీంతో ఈ నెల 23, 24 తేదీల్లో సిఐడి అధికారులు ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును విచారించారు. ఈ నెల 23న ఏడు గంటల పాటు చంద్రబాబును విచారించారు. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు బాబును విచారించారు. శనివారం నాడు ఏడు గంటల పాటు 50 ప్రశ్నలు అడిగారు. ఆదివారం మరో 70 ప్రశ్నలు అడిగినట్టుగా సమాచారం. ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సిఐడి అధికారులు తాము సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా చంద్రబాబునుంచి రెండ్రోజుల పాటు సమాచారం సేకరించారు. షెల్ కంపెనీలకు నిధుల విషయమై కూడ సిఐడి అధికారులు చంద్రబాబును ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. సిఐడి డిఎస్పీ ధనుంజయ్ నేతృత్వంలో సిఐడి అధికారులు చంద్రబాబును రెండు రోజుల పాటు విచారించారు.

చంద్రబాబు విచారణను సిఐడి అధికారులు వీడియో తీయించారు. సిఐడి విచారణకు ముందు, విచారణ తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సిఐడి అధికారులను ఎసిబి కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సిఐడి అధికారులు విచారించారు. ఆదివారం విచారణ పూర్తైన తర్వాత చంద్రబాబును ఎసిబి కోర్టు ముందు వర్చువల్ గా హాజరు పర్చారు. ఇదిలా ఉంటే చంద్రబాబును మరో మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఎసిబి కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసే యోచనలో ఉందని సమాచారం. ఈ నెల 9వ తేదీన చంద్రబాబును ఎపి స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 22వ తేదీతో రిమాండ్ పూర్తైంది. అయితే ఈ నెల 22న రిమాండ్‌ను రెండు రోజుల పాటు ఎసిబి కోర్టు పొడిగించింది. 30 అంశాలపై చంద్రబాబును సిఐడి అధికారులు ప్రశ్నిం చారు. ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏం జరిగిందనే విషయమై బాబు నుండి రాబట్టేందుకు సిఐడి అధికారులు యత్నించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News