Friday, December 27, 2024

చంద్రబాబు వారసుడు రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అంతర్గాం: సమైక్య పాలనలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వారసుడని అన్నారు. సోమవారం మండలంలోని సోమనపల్లి రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులు ట్రాక్టర్లతో ఎమ్మెల్యే కోరుకంటికి ఘన స్వాగతం పలికారు.

ఎమ్మెల్యే ట్రాక్టర్ నడుపుతూ ముందు రాగా రైతులు ర్యాలీగా ట్రాక్టర్లతో అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కంటక కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొంద పెట్టాలన్నారు. 60 ఏళ్ల పాలనలో ఏ ఒక్క నాయకుడు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నాడు కరెంటు అడిగినందుకు రైతులను కాల్చి చంపిన చంద్రబాబు వ్యవసాయం దండగన్నారు. ఆ చంద్రబాబు వారసునిగా రేవంత్ రెడ్డి మూడు గంటలే కరెంట్ చాలంటూ రైతుల ఆత్మహత్యలకు కారణం కానున్నాడని విమర్శించారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న సీఎం కేసీఆర్ కావాలో, మూడు గంటలు చాలంటున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావాలో రైతులే నిర్ణయించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో ఎరువులు, కరెంటుకు కరువు వచ్చిందని, కాలేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు కరెంటు, నీళ్లు, పెట్టుబడి సాయం, రైతు బీమా అన్ని అందుతున్నాయని అన్నారు. 2018 నుండి క్లస్టర్ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన 33 మంది రైతులకు రూ.1.65 కోట్ల రైతు బీమా అందించామన్నారు.

రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు పంటలు బీఆర్‌ఎస్ నినాదం, మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానమని, కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలో, కరెంటు వెలుగుల బీఆర్‌ఎస్ కావాలో రైతులు తేల్చుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కావాలని రైతులంతా ఏకగ్రీవ తీర్మాణం చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్‌ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ దివాకర్, మండల కోఆప్షన్ గౌస్‌పాషా, సర్పంచ్‌లు కొల్లూరి సత్య సతీష్, ధరణి రాజేశ్, దేవమ్మ రాములు, మెరుగు పోశం, బండారి ప్రవీన్, రవీందర్, బాదరవేని స్వామి, ధర్మాజీ కృష్ణ, కోల లత, కోండ్ర చంద్రయ్య, మల్లెత్తుల శ్రీనివాస్, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తిరుపతి నాయక్, నాయకులు ఎదులాపురం వెంకటేష్, కుర్ర నూక రాజు, గీట్ల శంకర్ రెడ్డి, మదన్ మోహన్‌రావు, కొమురయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News