Wednesday, January 22, 2025

ఆస్కార్ ప్రత్యేక వేడుకలో…

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్‌ఆర్‌ఆర్’ సందడి కొనసాగుతూనే ఉంది. గోల్డెన్ గ్లోడ్ అవార్డును సొంతం చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో చోటు సంపాదించిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో జరిగే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా క్యాలిఫోర్నియాలో 95వ ఆస్కార్ నామినీస్ ప్రత్యేక కార్యక్రమంలో నాటు నాటు పాట సృష్టికర్తలు అయిన కీరవాణి, చంద్రబోస్ లు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి టామ్ క్రూజ్ మొదలుకుని ఎంతో మంది దిగ్గజ హాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు.

Chandrabose and Keeravani at Oscar Special Event

వారందరితో మన తెలుగు సినిమా గర్వించే కీరవాణి, చంద్రబోస్ లు కలిశారు. మార్చి 12న జరగబోతున్న మెగా అకాడమీ అవార్డ్ ఈవెంట్‌కి మరెంతో మంది హాలీవుడ్ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకుంటే చాలు అని మొన్నటి వరకు అనుకున్న తెలుగు, ఇండియన్ సినీ అభిమానులు ఇప్పుడు ఆస్కార్ తీసుకు రావాలని కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News