Friday, December 27, 2024

కెకెఆర్ హెడ్ కోచ్‌గా చంద్రకాంత్

- Advertisement -
- Advertisement -

Chandrakanth Named as Head Coach of KKR

కోల్‌కతా: ఐపిఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్(కెకెఆర్) ప్రధాన కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ చంద్రకాంత్ పండిట్‌ను నియమించింది. ఇప్పటి వరకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన బ్రాండన్ మెకొల్లమ్ స్థానంలో చంద్రకాంత్‌ను కొత్త కోచ్‌గా కెకెఆర్ యాజమాన్యం ఎంపిక చేసింది. వచ్చే సీజన్‌లో చంద్రకాంత్ కోల్‌కతా జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తాడు. కాగా చంద్రకాంత్ పర్యవేక్షణలో మధ్యప్రదేశ్ టీమ్ రంజీ ట్రోఫీని సాధించిన విషయం తెలిసిందే. దీంతో పండిట్‌కు కోల్‌కతా కీలక బాధ్యతలు అప్పగించింది.

Chandrakanth Named as Head Coach of KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News