Thursday, January 23, 2025

టిటిడి ఇఒ ధర్మారెడ్డి కుమారుడు మృతి

- Advertisement -
- Advertisement -

 

తిరుపతి: టిటిడి ఇఒ ధర్మారెడ్డి తనయుడు చంద్రమౌళి(28) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున చంద్రమౌళికి గుండెపోటు రావడంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వెంటిలేటర్‌పై ఉంచి ఎక్మో సహాయంతో చికిత్సలు చేసిన ఫలితం లేకుండా పోయిందని కావేరీ వైద్యులు తెలిపారు. టిటిడి ఇవొ ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళికి, టిటిడి చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఎజె శేఖర్ రెడ్డి కుమార్తెతో పెళ్లి నిశ్చయమైంది. వచ్చే నెలలో వీరి పెళ్లి తిరుమలలో జరగాల్సి ఉంది. రెండు కుటుంబాలు శుభలేఖలు కూడా పంచారు. చంద్రమౌళి తన పెళ్లి పత్రికలను బంధువులకు ఇవ్వడానికి చెన్నైలోని ఆళ్వారుపేటకు వెళ్లారు. గుండెలో నొప్పి ఉందని చెప్పడంతో వెంటనే అతడిని సమీపంలో ఉన్న కావేరీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. చంద్రమౌళి మృతితో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.  తన సొంతూరు కర్నూలు జిల్లా నందికొట్కూరుకు మృతదేహాన్ని తరలించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News