Thursday, January 23, 2025

చంపుతానంటే బెదిరిపోతాను అనుకుంటున్నవా..

- Advertisement -
- Advertisement -

మెదక్ : జిల్లా రైస్ మిల్లు అధ్యక్షుడు తోడుపునూరి చంద్రపాల్‌ను చంపుతానని శ్రీధర్ గుప్త చేసిన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ విషయంలో జిల్లా రైస్ మిల్లర్లతో కలిసి సోమవారం తోడుపునూరి చంద్రపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయ్యింది. అంతే కాకుండా తనను చంపుతాను అంటూ వాట్సాప్ పోస్టులు పెట్టడమే కాకుండా తన పరువుకు భంగం వాటిల్లేలా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మంగళవారం నాడు శ్రీధర్‌గుప్తాపై నాలుగు కోట్ల పరువు నష్టం దావా వేస్తునట్లు తెలిపారు.

ఈ సందర్భంగా తోడుపునూరి చంద్రపాల్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా రైస్ మిల్లు ఇండస్ట్రీస్‌తో పాటు , రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నానని అలాంటి నన్ను చంపుతానని బెదిరించడమే కాకుండా అవివేకంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నా పరువు తీసారని ఆయన అన్నారు.ఈ విషయమై నాలుగు కోట్ల పరువు నష్టం దాబా వేస్తున్నానని ఇక ముందు కూడా జిల్లా రైస్ మిల్లర్ల పట్ల అధికారుల పట్ల తన వైఖరి మార్చుకొని మర్యాదగా ఉండాలని సూచించారు.

జిల్లాలోని అన్ని రైస్ మిల్లు తనకు సమానమైన అని తన తోటి మిల్లర్లు అందరూ కూడా ఎంతో కష్టనష్టాలతో మిల్లర్ నడుపుతుంటే ఇతనికి ముఖ్యమంత్రి కెసిఆర్ కేటాయించిన ధాన్యంలో దాదాపు 20 శాతం కావాలని బెదిరింపులకు పాల్పడడం ఎంత వరకు సమంజసం ప్రశ్నించారు. ఇక ముందు ఎవరైనా ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలకు దిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News