బెంగళూరు : నాసాకు చెందిన లూనార్ రీకనైజాన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌ఒ)తో భారత్‌కు చెందిన చంద్రయాన్ 2 ఢీకొనే ప్రమాదాన్ని నివారించ గలిగినట్టు ఇస్రో తెలియచేసింది. చంద్రుడిపై పరిశోధనలకు భారత్ చంద్రయాన్2ను ప్రయోగించగా, నాసా లూనార్ రీకనైజాన్స్ ఆర్బిటర్‌ను ప్రయోగించింది. ఈ రెండు అంతరిక్షనౌకలు అక్టోబర్ 20 న భారత కాలమానం ప్రకారం ఉదయం 11.15 గంటలకు లూనార్ నార్త్‌పోల్ వద్ద అత్యంత దగ్గరగా వస్తాయని వారం ముందుగానే రెండు సంస్థలూ అంచనా వేశాయి. ఈ సమయంలో రెండిటి మధ్య రేడియల్ విభజన దూరం వంద మీటర్ల కంటే తక్కువగా ఉంటుందని, అవి అత్యంత దగ్గరగా చేరుకునే దూరం కేవలం మూడు కిలోమీటర్లే అని ఇస్రో, జెపిఎల్/నాసా గుర్తించాయి. అంత చేరువయ్యే రిస్కును తగ్గించాలని నిర్ణయించాయి. చంద్రయాన్ 2 కు ఢీ నివారణ చర్యలు (కొలిజన్ ఎవాయిడెన్స్ మేనోవర్ క్యామ్) చేపట్టాలని పరస్పరం అంగీకరించాయి. దీంతో అక్టోబర్ 18న భారత కాలమానం ప్రకారం రాత్రి 8.22 కు చంద్రయాన్2 కక్ష గమనాన్ని ఇస్రో స్వల్పంగా మార్చింది. ఈ రెండు అంతరిక్ష నౌకల మధ్య తదుపరి చేరువ తగినంత పెద్ద రేడియల్ విభజన ఉండేలా క్యామ్ చర్యలు చేపట్టింది. తరువాత చంద్రయాన్ 2 ,నాసా ఎల్‌ఆర్‌ఒ అత్యంత చేరువగా వచ్చే అవకాశం ఇక భవిష్యత్తులో ఉండబోదని ఇస్రో వెల్లడించింది.
చంద్రయాన్2, నాసా ఎల్‌ఆర్‌ఒ అంతరిక్ష నౌకల సంఘర్షణ నివారణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -