Monday, December 23, 2024

చంద్రుడిపై భారీగా సోడియం.. గుర్తించిన చంద్రయాన్ 2

- Advertisement -
- Advertisement -

Chandrayaan-2 finds sodium on moon

న్యూఢిల్లీ : చంద్రుడిపై భారీగా సోడియం ఉన్నట్టు చంద్రయాన్2 గుర్తించింది. చంద్రయాన్ 2 లో ఉన్న క్లాస్ (చంద్రయాన్ 2 లార్‌జ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్టోమీటర్ ) ద్వారా ఈ సోడియం నిల్వల మ్యాపింగ్ చేసినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) తెలిపింది. గతంలో చంద్రయాన్ 1 లోని ఫ్లూరోసెన్స్ స్పెక్టోమీటర్ (సీ1 ఎక్స్‌ఎస్ ) తొలిసారిగా చంద్రుడిపై సోడియం ఉన్నట్టు గుర్తించింది. ఇప్పుడు చంద్రయాన్ 2 ఈ సోడియం మ్యాపింగ్ చేసినట్టు ఇస్రో ప్రకటించింది. హైసెన్సిటివిటీ, సామర్ధం కలిగిన క్లాస్‌ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో తయారు చేసినట్టు ఇస్రో తెలిపింది. దీనివల్లనే ఇది సోడియం లైన్స్‌ను వెంటనే గుర్తిస్తుందని పరిశోధకులు చెప్పారు. లూనార్ గ్రెయిన్స్‌తో కలిసి ఉన్న సోడియం కణాలను ఈ క్లాస్ గుర్తించింది. చంద్రుడిపై ఉన్న వాతావరణంలో ఇలా సోడియం లభించడం ఆశ్చర్యకరమని చెప్పారు. ఈమేరకు ‘ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్’ లో ప్రచురితమైన కథనంలో ఇస్రో పేర్కొంది. చంద్రుడి ఉపరితలం , ఎక్సోస్పేర్ సంబంధాన్ని అధ్యయనం చేయడానికి తాజా పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల భావన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News