Tuesday, November 5, 2024

చంద్రుని చుట్టూ 9 వేల సార్లు తిరిగిన చంద్రయాన్- 2 : ఇస్రో

- Advertisement -
- Advertisement -

Chandrayaan-2 orbiting the moon 9 thousand times

బెంగళూరు : చంద్రయాన్2 వ్యోమనౌక ఇప్పటికి చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు తిరిగిందని, ఈ వ్యోమనౌక లోని పరికరాలు అద్భుతమైన డేటా అందించాయని ఇస్రో అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. చంద్రుడి కక్ష లోకి చంద్రయాన్2 వెళ్లి రెండేళ్లయిన సందర్భంగా సోమవారం నుంచి రెండు రోజుల పాటు లూనార్ సైన్స్ వర్క్‌షాప్ 2021 ని ఇస్రో నిర్వహిస్తోంది. ఈ వర్క్‌షాప్ ప్రారంభం సందర్భంగా ఇస్రో ఛైర్మన్ కె. శివన్ మాట్లాడుతూ చంద్రయాన్2 లోని 8 పరికరాలు రిమోట్ సెన్సింగ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇది భూమి నుంచి 100 కిమీ ఎత్తులో ఉండి చంద్రుడిని పరిశీలిస్తోందని తెలిపారు. ఈ రెండేళ్లలో చంద్రయాన్ 2 పంపిన డేటాను శివన్ వెల్లడించారు. చంద్రయాన్ 2 తన పరికరాలతో కొత్త ఆవిష్కరణలను చాలావరకు ఆవిష్కరించిందని ఇస్రో మాజీ ఛైర్మన్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. చంద్రయాన్ అనుబంధ వ్యవస్థలన్నీ చక్కగా పనిచేస్తున్నాయని ప్రాజెక్టు డైరెక్టర్ వనితా ఎం చెప్పారు. ఈ వర్క్‌షాపులో చంద్రయాన్ 2 పై మరిన్ని శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News