Sunday, December 22, 2024

చంద్రుని దక్షిణ ద్రువానికి 600 కిమీ దూరంలో విక్రమ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కు చెందిన లూనార్ రికన్నై‘సెన్స్’ఆర్బిటార్ ప్రస్తుతం చంద్రుని చుట్టూ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ శాటిలైట్‌కు చంద్రయాన్3 కి చెందిన విక్రమ్ ల్యాండర్ చిక్కింది. విక్రమ్‌ను ఆ ఆర్బిటార్ ఫోటో తీసింది. ఆ ఫోటోలను నాసా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆగస్టు 23వ తేదీన చంద్రుని దక్షిణ ద్రువానికి 600 కిమీ దూరంలో విక్రమ్ ల్యాండర్ దిగినట్టు నాసా పేర్కొంది.

అయితే ఆగస్టు 27 వ తేదీన నాసాకు చెందిన ఎల్ ఆర్వో ఈ ఫోటోను తీసింది. ల్యాండింగ్ జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆ ఫోటో తీశారు. విక్రమ్ ల్యాండర్‌ను 42 డిగ్రీల కోణంలో ఎల్‌ఆర్వో కెమెరా ఫోటో తీసినట్టు నాసా వెల్లడించింది. అయితే ఆ ల్యాండర్ నుంచి వెలువడిన వాయువులు, అక్కడి నేలతో ఇంటరాక్ట్ కావడం వల్ల విక్రమ్ చుట్టూ ఆ ప్రగాఢ కాంతి కనిపించినట్టు నాసా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News