Monday, December 23, 2024

అసాధారణం అనిపిస్తే చంద్రయాన్ 3 ల్యాండింగ్ 27కు వాయిదా: ఇస్రో

- Advertisement -
- Advertisement -

చెన్నై: చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ లోని పారామీటర్లు “అసాధారణం” అనిపిస్తే ఆగస్టు 23న జరగాల్సిన సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ఆగస్టు 27కు వాయిదా వేయవలసి వస్తుందని ఇస్రోకు చెందిన సీనియర్ సైంటిస్ట్ వెల్లడించారు. ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ వేగాన్ని తగ్గించడంలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.

“ఆగస్టు 23న జాబిల్లి ఉపరితలానికి 30 కిమీ ఎత్తులోంచి ల్యాండర్ కిందకు దిగడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ల్యాండర్ సెకనుకు 1.68 కిమీ వేగంతో ఉంటుంది. అయితే జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి కూడా ఇందులో కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి వేగాన్ని తగ్గించడంపైనే తమ దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది” అని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ పేర్కొన్నారు. ఆ వేగాన్ని నియంత్రించ లేకుంటే ల్యాండింగ్ క్రాష్ అయే అవకాశాలు ఉంటాయి అని అన్నారు. అంతకు ముందు ఇస్రో అన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News