Monday, December 23, 2024

జులై 13న చంద్రయాన్ 3 ప్రయోగం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్ 3 ప్రయోగానికి తేదీ ఖరారైంది. జులై 13 మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రునిపైకి ప్రయోగించనున్నట్టు ఇస్రో ప్రకటించింది. శ్రీహరికోట లోని షార్ నుంచి జీఎస్‌ఎల్‌వి ఎం3 వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నట్టు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ బుధవారం వెల్లడించార. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ. 615 కోట్లు కేటాయించింది. ఈ మిషన్ చంద్రునిపై ప్రయోగించే మూడో ప్రయోగం. 2019 లో ప్రయోగించిన చంద్రయాన్ 2 మిషన్ విజయవంతమయ్యే తరుణంలో సాంకేతిక లోపం తలెత్తి ల్యాండింగ్ అనుకున్నట్టు జరగలేదు.

చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్షంగా చేపట్టిన చంద్రయాన్ 2 , చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో విఫలమైంది. అయినప్పటికీ ఎనిమిది సాంకేతిక పరికరాలతో కూడిన ఆర్బిటర్ మాత్రం చంద్రుడి కక్షలో విజయవంతంగా తిరుగుతోంది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉపగ్రహం అనుసంధాన పనులతోపాటు రోవర్, ల్యాండర్ బిగింపు పనులు ఏకకాలంలో చేస్తున్నారు. ల్యాండర్‌లో డాప్టర్ వెలోసీమీటర్ (ఎల్‌డివి)ని అమర్చినట్టు చెబుతున్నారు. ఇది ల్యాండింగ్‌ను సులభతరం చేస్తుంది. ఇందులో ల్యాండర్, రోవర్ కదలికలను సరిగ్గా పరిశోధించడానికి వీలుగా సరైన టెక్నాలజీని ఉపయోగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News